ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్.. ఒక్కసారే 17 కేసులు.. ఆ జిల్లాలో 8

Share Icons:
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగింది. తాజాగా ఏపీలో మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్త కేసులు 40కు చేరాయి. ప్రకాశం జిల్లాలో ఏకంగా 8 కేసులు.. గుంటూరు జిల్లాలో 5.. అనంతపురం 2.. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు ఉన్నాయి. ఈ పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీలో తబ్లిగి జమాత్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తులు.. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఢిల్లీలో తబ్లిగి జమాత్‌కు వెళ్లి వచ్చిన వారి పేర్లను జిల్లాల వారీగా ప్రభుత్వం విడుదల చేసింది. వీరంతా వెంటనే త్వరగా తమ ఊళ్ళల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి హెల్త్‌ చెకప్ చేయించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సమాజ హితం కోరి అందరూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

విజయనగరం జిల్లా – 3
విశాఖపట్నం రూరల్ – 1
విశాఖపట్నం సిటీ – 41
తూర్పు గోదావరి జిల్లా – 6
పశ్చిమ గోదావరి జిల్లా – 16
రాజమండ్రి – 21
కృష్ణ జిల్లా – 16
విజయవాడ సిటీ‌ – 27
గుంటూరు అర్బన్ – 45
గుంటూరు రూరల్ – 43
ప్రకాశం జిల్లా – 67
నెల్లూరు జిల్లా – 68
కర్నూలు జిల్లా – 189
కడప జిల్లా – 59
అనంతపురం జిల్లా – 73
చిత్తూరు జిల్లా – 20
తిరుపతి – 16
మొత్తం 711మంది ఉన్నారు.