ఏపీలో పోలీస్ టెర్రరిజం.. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

Share Icons:
రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులే ఇలాంటి టెర్రరిజాన్ని సృష్టిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బైండోవర్‌ కేసుల పేరుతో పోలీసులే అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడితే ఎలాగని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. నియంతలను కాపాడేందుకే పోలీస్ టెర్రరిజం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

Also Read: ఇలాగే ప్రవర్తిస్తే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వెళ్తే అన్ని విధాలుగా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ దాడులకు సంబంధించిన కొన్ని వీడియాలను చంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు. ఓ పక్క శారీరకంగా దాడులు చేస్తూ, మరోవైపు ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారని.. చట్ట ప్రకారం పనిచేయాలంటే వీలుకాని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Also Read:
అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్వీర్యమైందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకాలు ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని నిలదీశారు. రాష్ట్ర డీజీపీ కోర్టుకు వెళ్లి సెక్షన్‌ చదివిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరి ఆస్తులకైనా భద్రత ఉందా? మహిళలకు భద్రత ఉందా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. వీరిని ఇలాగే వదిలేస్తే ఉగ్రవాదులకంటే ఘోరంగా తయారవుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Also Read: