ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి.. అనంత, కృష్ణాలో ఒక్కొక్కరు?

Share Icons:
ఆంధ్రప్రదేశ్‌లో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 194కు చేరింది. శనివారం ఉదయానికి 164 నమోదు కాగా.. రాత్రికి మరో 30 కేసులు పెరిగినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే అధికంగా ఉన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 30న అతడు చనిపోయినా ఏప్రిల్ 3న వెలుగులోకి వచ్చింది. మృతుడు కుమారుడు నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చాడు. ఇదిలా ఉండగా ఏపీలో శనివారం మరో ఇద్దరు కరోనా వైరస్ బారినపడి మృతిచెందినట్టు సమాచారం.

Read Also:

అనధికారిక సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ రెండుతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య మూడుకి చేరింది. మరోవైపు, రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉంది. శుక్రవారం రాత్రి 10.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 30 కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం ప్రభుత్వం వెల్లడించిన ప్రకటనలో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 190గా పేర్కొన్నారు. గుంటూరులో కొత్తగా ఆరు కేసులు నమోదయినట్టు అందులో తెలిపారు. కానీ, జిల్లాలో 10 కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారి స్థానికంగా ప్రకటించారు.

Read Also:

ప్రభుత్వం వెల్లడించిన బులిటెన్‌ ప్రకారం కృష్ణా జిల్లాలో 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూరం జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు పేర్కొంది. కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 190కి పెరిగినట్లు వెల్లడించింది. గుంటూరు, కడప, కృష్ణా, నెల్లూరు.. నాలుగు జిల్లాల్లోనే 113 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కేసుల సంఖ్య రాత్రికి మరో నాలుగు పెరిగి 194కు చేరుకున్నాయి.

Read Also:
రాష్ట్రంలో అత్యధికంగా నెల్లూరు, కృష్ణాలో 32 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 30, కడప 23, ప్రకాశం 21, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో 15 చొప్పున, తూర్పుగోదావరిలో 11, చిత్తూరు 10, కర్నూలు 4, అనంతపురం 3లో కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క కేసూ నమోదుకాలేదు.