‘ఎఫ్ 3’అంతా రెడీ.. కాని వెంకటేష్ వెనకడుగుకి కారణం అదేనా?

Share Icons:
డైరెక్షన్‌లో వచ్చిన ఎఫ్2 సినిమా బాక్సీఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఇంట్లో నిజంగా పండగ తీసుకొచ్చింది. , వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ ‘ఎఫ్ 2′. థియేటర్లలో ఈ సినిమా నవ్వుల వర్షం కురిపిస్తుండటంతో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 కూడా వస్తున్న విషయం తెలిసిందే.
సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ సినిమా చేసిన తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంగా ‘ఎఫ్ 3’ తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో కూడా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటింస్తున్న సమాచారం.

గత కొన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని నిర్వహిస్తున్నారు. పూర్తి స్క్రిప్టును కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే సిద్ధం చేశాడు. ప్రస్తుతం వెంకటేశ్ చేస్తున్న ‘నారప్ప’ చిత్రం తర్వాత దీనిని సెట్స్ పైకి తీసుకు వెళదామని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడీ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే. సినిమా నిర్మాణాలన్ని నిలిచిపోవడంతో అనేక మంది ఉపాధి కొల్పోయిన విషయం తెలిసిందే. దీంతో సినీ సెలబ్రిటీలంతా తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి షూటింగ్స్ కోసం అనుమతి కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల నుంచి షూటింగులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఓకే చెప్పిన కొందరు హీరోలు మాత్రం షూటింగ్స్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకొచ్చిన తొందర అంటూ.. తమకు సంబంధించిన సినిమా షూటింగులను మరికొన్నాళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే బన్నీ పుష్ఫ సినిమా షూటింగ్‌ను మరో మూడు నెలలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా వెంకటేష్ కూడా మాత్రం అప్పుడే షూటింగులో జాయిన్ కావడం లేదని తెలుస్తోంది. రెండు మూడు నెలల తర్వాతే ఆయన ‘నారప్ప’ షూటింగ్ లో జాయిన్ అవుతారని, అది పూర్తవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. దీంతో ‘ఎఫ్ 3’ చిత్రాన్ని వచ్చే ఏడాది చేయడానికి వెంకీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఇదే జరిగితే ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకాస్త సమయం పట్టేలానే ఉంది.