ఉమామహేశ్వరుడి మరో డీసెంట్ డీల్.. శాటిలైట్ రైట్స్‌కు మంచి ధర

Share Icons:
టాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. మంచి వ్యూవర్‌షిప్‌ను సాధిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందంటూ మరొకరికి చెబుతున్నారు.

ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు శాటిలైట్ రైట్స్‌కు కూడా మంచి ధర లభించింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీ సొంతం కొనుగోలు చేసింది. రూ.2.5 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ను ఈటీవీ కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంటే, మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఈటీవీలో ప్రసారమవుతుంది.

Also Read:

కాగా, మ‌ల‌యాళ హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్రతీకార‌మ్‌’ చిత్రాన్ని తెలుగులో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ పేరుతో రీమేక్ చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మ‌హ దర్శకత్వం వహించారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని, విజ‌య ప్రవీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్రభాక‌ర్ సినిమాటోగ్రఫీని అందించారు. వీకే న‌రేష్‌, సుహాస్‌, జ‌బర్దస్త్ రాంప్రసాద్‌, కరుణాకరన్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ సినిమాను అరకు వ్యాలీలో కేవలం 36 రోజుల్లో చిత్రీకరించారు.