ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు

Share Icons:

ముంబై, మే 21,

అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలట్ ఎంట్రీ, టెక్నికల్, లా విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఆసక్తిగల అభ్యర్థులు joinindiancoastguard.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ మే 24న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 4. మార్కులను బట్టి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ పాసైనవారిని ఫైనల్ సెలక్షన్‌కు పిలుస్తారు.

దరఖాస్తు ప్రారంభం: 2019 మే 24దరఖాస్తుకు చివరి తేదీ 2019 జూన్ 4 సాయంత్రం 5 గంటల వరకు

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: 2019 జూన్ 14విద్యార్హతలు: జనరల్ డ్యూటీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పాస్ కావాలి. కమర్షియల్ పైలట్ ఎంట్రీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో 12వ తరగతి(ఫిజిక్స్, మ్యాథ్స్‌) పాసై ఉండాలి. టెక్నికల్ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి. లా అభ్యర్థులు 60 శాతం మార్కులతో లా డిగ్రీ పాసై ఉండాలి.

Leave a Reply