ఇంటి దగ్గర కూరగాయలు పండిస్తున్న సమంత

Share Icons:
ఏ మాయ చేశావే అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ సమంత. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడి ఆ ఇంట కోడలు అయిపోయింది. అయితే పెళ్లికి ముందే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా అదే బాటలో నడుస్తుంది. ఇటు కుటుంబంతో పాటు అటు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటోంది. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే శ్యామ్ లాక్‌డౌన్‌లో కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇంట్లో పలు సందర్భాల్లో దిగిన ఫోటోల్ని తన అభిమానులకు షేర్ చేస్తూ వస్తోంది సమంత.

తాజాగా సమంత వ్యవసాయం కూడా చేసే పనిలో పడింది. తన వెజిటబుల్‌ గార్డన్‌ను అభిమానులకు పరిచయం చేసింది. అర్బన్‌ కిసాన్‌ వారితో కలిసి తన ఇంటి టెర్రస్‌ మీద వెజిటబుల్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేసింది. మనం తినే కూరగాయలను మనమే ఎలాంటి కెమికల్స్‌ లేకుండా ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పిందీ ఈ బ్యూటీ. అందుకని లాక్‌డౌన్‌లో సమంత ఆర్గానిక్‌ పద్ధతిలో వెజిటబుల్స్‌ పండించడం నేర్చుకున్నది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది సమంత.

ఇంటి టెర్రస్ పైనే చిన్న సైజులో స్టాండ్స్ ఏర్పాటుచేసింది. అందులో రకరకాల ఆకు కూరలు, కూరగాయలు పండిస్తోంది. మొక్కలకు అవసరమైన గాలి వెలుతురు తగిలిలే కూడా ఏర్పాట్లు చేసింది. దీంతో సామ్ గార్డెన్ చూసిన ఆమె అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. సమంత సూపర్ అంటూ కితాబిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మెన్ 2‘వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.