ఇంగ్లాండ్ టూర్‌కి ఆస్ట్రేలియా టీమ్ ప్రకటన

Share Icons:
ఇంగ్లాండ్ పర్యటన కోసం క్రికెట్ (సీఏ) 26 మందితో కూడిన ప్రాథమిక జట్టుని తాజాగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి ఆ దేశ క్రికెటర్లు ఆటకి దూరంగా ఉంటుండగా.. మరోవైపు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం మొదలెట్టాయి. ఇక ఆగస్టు 5 నుంచి పాకిస్థాన్ కూడా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంగ్లాండ్ పర్యటన కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జట్టుని ప్రకటించింది.

ఇంగ్లాండ్ గడ్డపై సెప్టెంబరు 1న పాకిస్థాన్ పర్యటన ముగియనుండగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య వన్డే, టీ20 సిరీస్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కానీ.. పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్‌ని నిర్వహించాలని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యోచిస్తుండటంతో.. కనీసం నెల రోజుల ముందు టీమ్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అక్కడికి పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రాథమిక జట్టుని ప్రకటించిన సీఏ.. వారికి కరోనా వైరస్ పరీక్షల అనంతరం టీమ్ క్యాంప్‌ని నిర్వహించే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వెడ్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, డీఆర్క్‌ షాట్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్కస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, మైకేల్ నేసర్, జోష్ ఫిలిప్, డేనియల్ సామ్స్