ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా.. ఇంకెన్ని రోజులో ఇలా!! స్టార్ హీరోయిన్ ఆవేదన

Share Icons:
ఈ ఏడాది (2020) ఊహించని పరిణామాలు చోటుచేసుకొని ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం అయింది. కరోనా మహమ్మారి విలయతాండవంతో మన దేశం అల్లాడిపోతోంది. రోజురోజుకూ కరోనా ఉదృతి పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు, సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి.

తాజా పరిస్థితులు చూస్తుంటే 2020 సంవత్సరం అంతా ఇలాగే ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై బాగా పడింది. థియేటర్స్ మూతపడటం, షూటింగ్స్ రద్దు కావడంతో సినీ కార్మికులు మొదలుకొని, దర్శకనిర్మాతల వరకు అందరూ తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ చిన్న సందేశం పోస్ట్ చేస్తూ ఆవేదన చెందింది.

Also Read:
ఈ మేరకు సింపుల్‌గా ‘2021 కోసం ఎదురు చూస్తున్నా’ అని పేర్కొంటూ 2020 సంవత్సరంలో తాను ఎంత బాధ పడుతున్నానో తెలియ‌జేసే విధంగా ఓ పిక్ షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ చూసి.. ”మా ఫీలింగ్స్ కూడా సేమ్ మేడం” అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. కరీనా ప్రస్తుతం ‘లాల్ సింగ్ చ‌ద్ధా’ సినిమాలో నటిస్తోంది. అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.