ఆ రిస్క్ లేకుంటేనే క్రికెట్ పున‌రుద్ధ‌రణ‌: ఐసీసీ

Share Icons:
క‌రోనా వైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డిన క్రికెట్ కార్య‌క‌లాపాల‌ను తిరిగి గాడిన పెట్టేందుకు ప్ర‌యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోక్రికెట్ పునరుద్ధ‌ర‌ణ కోసం ఇప్ప‌టికే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అయితే లోక‌ల్ ట్రాన్మిష‌న్ లేక‌పోతేనే ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వ‌హించుకోవాల‌ని స‌భ్య‌దేశాల‌కు సూచించింది. క్రికెట్ ఆడే దేశాల్లో ఇంగ్లాండ్‌లో క‌రోనా రిస్క్ అధికంగా ఉండ‌గా, భార‌త్, పాకిస్థాన్ దేశాల్లో రోజురోజుకు విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Must Read:
ఈ నేప‌థ్యంలో ప్లేయ‌ర్ల ర‌క్ష‌ణ‌ను ప్ర‌థ‌మ ప్రాధాన్యంగా భావించాల‌ని ఐసీసీ స్ప‌ష్టం చేసింది. క‌రోనా ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని పేర్కొంది. రెగ్యుల‌ర్ శానిటైజేష‌న్ చేసుకోవ‌డం, చేతుల‌ను శుభ్ర ప‌రుచుకోవ‌డం, ఒక‌రు వాడిన వ‌స్తువుల‌ను మ‌రొక‌రు వాడ‌క‌పోవ‌డంలాంటి చ‌ర్య‌లను తీసుకోవాల‌ని సూచించింది. ఇలాంటి ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌ల ద్వారానే క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని తెలిపింది.

Must Read:
క‌రోనా విష‌యంలో ఆయా ప్ర‌భుత్వాలు సూచించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని ఈ సంద‌ర్బంగా ఐసీసీ సూచించింది. మ‌రోవైపు సిరీస్ ప్రారంభానికి ముందు ఆట‌గాళ్ల‌ను క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి వ‌క్కాణించింది. మ‌రోవైపు 53 ల‌క్ష‌ల 47 వేల మందికి క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. అలాగే మూడు ల‌క్ష‌ల 40 వేల‌మంది మ‌ర‌ణించారు.