ఆ ఆస్కార్ సినిమా విజయ్‌దట.. కేసు పెడతానంటున్న నిర్మాత

Share Icons:
ఇటీవల ఆస్కార్స్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఆస్కార్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ‘పారసైట్’ అనే సౌత్ కొరియన్ సినిమాకు నాలుగు కేటగిరీల్లో అవార్డు వరించింది. అయితే ఈ సినిమాను ప్రముఖ తమిళ నటుడు నటించిన ‘మిన్సార కన్నా’ అనే తమిళ సినిమా నుంచి కాపీ కొట్టారట. ‘పారసైట్’కు నాలుగు అవార్డులు రావడంతో అసలు ఆ సినిమాలో ఆస్కార్ వరించేంత ఏముందా అని పలువురు నెటిజన్లు ఈ సినిమా చూసారు. తీరా చూస్తే ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ‘మిన్సార కన్నా’ సినిమాను కాపీ పేస్ట్ చేసినట్లు ఉందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

READ ALSO:

అకాడమీ అవార్డ్స్ నిర్వాహకులు ఇండియన్ సినిమాలకు ఆస్కార్ ఇవ్వరు కానీ ఇక్కడి సినిమాలను బాగానే కాపీ కొడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు షాప్ లిఫ్టర్స్ అనే మూవీ ఛాయలు కూడా పారాసైట్‌లో కనిపించినట్లు కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే మిన్సార కన్న సినిమా హక్కులు తేనప్పన్ అనే నిర్మాత దగ్గర ఉండగా.. పారాసైట్‌పై ఆయన లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఇంటర్నేషనల్‌ న్యాయవాదితో ఆయన సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే పారాసైట్ మేకర్లకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు టాక్. కాగా ఈ ఏడాది ఎక్కువ ఆస్కార్‌లు సాధించిన పారాసైట్‌కు.. కాపీ మరకలు అంటడం అంతర్జాతీయంగానూ హాట్‌ టాపిక్‌గా మారింది.