ఆసీస్ టూర్‌లో డే/నైట్ టెస్టుకు ఇండియా రెడీ

Share Icons:
ప్ర‌తిష్టాత్మ‌క ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ ఆడ‌నుంద‌ని తెలుస్తోంది. బీసీసీఐ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం ఈ ఏడాది చివ‌ర్లో భార‌త్.. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. అందులో ఒక మ్యాచ్ డే/నైట్ టెస్టుగా నిర్వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్లోని గ‌బ్బా స్టేడియంలేదా అడిలైడ్‌లో నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. భార‌త్ త‌న తొట్ట‌తొలి డే/నైట్ టెస్టును గ‌తేడాది ఆడిన సంగ‌తి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఈ మ్యాచ్ ఆడి ఘ‌న‌విజ‌యం సాధించింది.

Read Also:
నిజానికి గ‌త‌నెల‌లో మూడు వ‌న్డేల సిరీస్ ఆడేందుకు ఆసీస్ మ‌న‌దేశానికి వ‌చ్చింది. ఆ టీమ్‌తోపాటు క్రికెట్ ఆస్ట్రేలియ పెద్ద‌లు కూడా విచ్చేశారు. బీసీసీఐతో నిర్వ‌హించిన భేటీలో డే/నైట్ టెస్టు గురించి చ‌ర్చకొచ్చినట్లు స‌మాచారం. అంత‌కుముందు భార‌త్ ఆడిన డే/నైట్ టెస్టు విజ‌య‌వంతం కావ‌డంతో బీసీసీఐ కూడా పింక్ మ్యాచ్ ఆడేందుకు సంసిద్ధత వ్య‌క్తం చేసింది.

Read Also:
మ‌రోవైపు 2018లో ఆస్ట్రేలియాలో భార‌త్ ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా డే/నైట్ టెస్టు ఆడాల‌ని సీఏ రిక్వెస్ట్ చేసింది. అయితే అనుభ‌వం లేద‌ని బోర్డు ఆ ప్రతిపాద‌న‌ను తిర‌స్క‌రించింది. ఇక గ‌త‌నెల‌లో వ‌న్డే సిరీస్ సంద‌ర్భంగా ఆసీస్‌లో ఎక్క‌డైనా డే/నైట్ టెస్టు ఆడ‌తామ‌ని భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో తాజాగా ఆసీస్ టూర్‌లో పింక్ మ్యాచ్ ఆడేందుకు బోర్డు నుంచి సాన‌కూల స్పంద‌న వ‌చ్చింది.