ఆరోజు విజయనిర్మల గారు లేని లోటు కనిపించింది: మహేష్ బాబు

Share Icons:
‘‘నా సినిమాలు విడుదలైన ప్రతిసారి మొదట నాన్నగారు మార్నింగ్ షో చూసి నాతో మాట్లాడేవారు. తరవాత విజయనిర్మల గారు మాట్లాడి కంగ్రాట్స్ చెప్పేవారు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తరవాత నాన్నగారు కంగ్రాచ్యులేట్ చేశారు. తరవాత ఆవిడ మాట్లాడబోతుంది అనుకొని వెంటనే రియలైజ్ అయ్యాను. ఆరోజు ఆ లోటు నాకు కనిపించింది’’ అని అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కిందటేడాది జూన్ 27న కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం (ఫిబ్రవరి 20న) ఆమె 74వ జయంతి. ఈ సందర్భంగా నానక్‌రామ్ గూడలోని కృష్ణ, విజయనిర్మల నివాసంలో ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు దంపతులు, మహేష్ బాబు, నమ్రత, మురళీ మోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, సుధీర్ బాబు దంపతులు, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. విజయనిర్మల విగ్రహానికి నివాళులర్పించారు.

See Photos:

కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘విజయనిర్మల గారు నాకు తెలిసి వన్ ఆఫ్ మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఎవర్. నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి ఫస్ట్ నాన్నగారు మార్నింగ్ షో చూసి నాతో మాట్లాడేవారు. తరువాత విజయనిర్మల గారు మాట్లాడి కంగ్రాట్స్ చెప్పేవారు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తరువాత నాన్న గారు కంగ్రాచ్యులేట్ చేశారు తరువాత ఆవిడ మాట్లాడబోతుంది అనుకొని వెంటనే రియలైజ్ అయ్యాను. ఆరోజు ఆ లోటు కనిపించింది. ఈరోజు మనందరం ఆవిడను మిస్ అవుతున్నాం. ప్రతిఏటా ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించే వాళ్లం. ఈ ఏడాది విగ్రహావిష్కరణతో ఆమెకు మేము ఇస్తున్న చిన్న నివాళి ఇది. ఇవాళ ఆవిడ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు’’ అన్నారు.

Also Read: