ఆయనకి అదంటే అస్సలు ఇష్టం ఉండదు! పిల్లల్ని కనడంపై అనుష్క ఓపెన్ కామెంట్స్

Share Icons:
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో ముందువరుసలో ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ . టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడూ భర్తతో కలిసి షికార్లు కొడుతూ ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అనుష్క ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ ఆమె సోషల్ మీడియా ఖాతాలకు మంచి డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కాసేపు ముచ్చింటించిన అనుష్క శర్మ.. తన లైఫ్ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు చెబుతూ ఓపెన్ అయింది.

2017 సంవత్సరం డిసెంబర్ 11న ఇండియన్‌ క్రికెట్‌ టీమ్ కెప్టెన్ , బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి పబ్లిక్‌గా షికార్లు కొడుతూ హాట్ హాట్ ఫోజులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది విరుష్క జోడీ. అయితే వీరి పెళ్లి జరిగి దాదాపు మూడేళ్లు గడుస్తుండటంతో ఇంకా పిల్లల్ని ఎప్పుడు కంటారు? అనే దానిపై జనం దృష్టి పడింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో ఓ నెటిజన్ ఇదే ప్రశ్న వేశాడు. ‘మీ చుట్టూ ఉన్న వాళ్లు మిమ్మిల్ని పిల్లలు ఎప్పుడు కంటారు అని ప్రశ్నిస్తున్నారా? అని అడిగాడు. దీనిపై స్పందించిన అనుష్క.. కేవలం సోషల్‌ మీడియాలోనే దీని గురించి చర్చ తప్పితే మమ్మల్ని ఎవ్వరూ అడగడం లేదని చెప్పింది.

Also Read:
ఇక విరాట్ కోహ్లికి ఏదంటే ఎక్కువగా ఇష్టం ఉండదని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఓడిపోవడమంటే ఆయనకు అస్సలు ఇష్టముండదని తెలిపింది అనుష్క. ఇంట్లో విరాట్ తనకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంటాడని చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా అటు కోహ్లీకి ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు లేక, ఇటు అనుష్క శర్మకు షూటింగ్స్ లేక ఇద్దరూ కలిసి గూటిలోని పక్షుల్లా ఇంట్లోనే ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

గతేడాది ‘జీరో’ మూవీతో అలరించిన అనుష్క శర్మ.. చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. చాలా గ్యాప్ తీసుకొని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌గా రానున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటించేందుకు ఆమె రెడీ అయింది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ అతిత్వరలో ప్రారంభం కానుంది.