అల్లు అర్జున్ 21: బన్నీ అభిమానులను హుషారెత్తించే అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌తో కన్ఫర్మ్

Share Icons:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అభిమానులను హుషారెత్తించే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. బన్నీ కెరీర్‌లో 21వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుపుతూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున నిలబడి అవతల ఒడ్డున ఉన్న ఊరిని చూస్తూ కనిపిస్తున్నారు.

ఈ మేరకు తన తదుపరి సినిమా విశేషాలు తెలుపుతూ ఎక్జైట్ అయ్యారు అల్లు అర్జున్. ”నా తదుపరి చిత్రం కొరటాల శివ గారితో చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. కొంతకాలంగా దీని కోసమే ఎదురుచూస్తున్నాను. సుధాకర్‌ గారి మొదటి ప్రాజెక్టుకు నా శుభాకాంక్షలు. శాండి, స్వాతి, నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను చూపించే మార్గం” అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంతో సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Also Read:
యువ సుధా ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రూపొందనున్న ఈ చిత్రానికి శాండీ, స్వాతి, నట్టీలు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ సినిమాను 2022 ప్రథమార్థంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ తన 20వ మూవీ ‘పుష్ప’ చేస్తుండగా, డైరెక్టర్ కొరటాల శివ.. చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా రూపొందిస్తున్నారు.