అలా ఉంటే దేశభక్తుడిని…లేకపోతే దేశద్రోహిని

ktr indirect comments on bjp
Share Icons:

హైదరాబాద్:

 

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. హైదరాబాద్ లో తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరై ప్రసంగించారు. భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హైదరాబాద్‌లో స్వేచ్ఛ ఉందన్నారు. పాలనలో ఏమైనా తప్పులున్నా ఎత్తి చూపే స్వేచ్ఛ వికాస సమితికి ఉంది.

 

ఇక భాషకు మతం ఉండదని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఎప్పుడూ చెబుతుండేవారని, ముస్లింల కంటే అనర్గళంగా ఉర్దూ మాట్లాడే ఇతరులు చాలా మంది ఉన్నారని అన్నారు. లౌకికవాద దేశమంటే మతాన్ని రద్దు చేయడం కాదు. ఒక మతాన్ని వ్యతిరేకించడం, లేదా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని చెప్పుకొచ్చారు.

 

ఇక గాడ్సే గొప్ప దేశభక్తుడని సాధ్వీప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యను తాను ఖండిస్తే సోషల్‌ మీడియాలో దారుణమైన వ్యతిరేకత వ్యక్తమైందని, ప్రస్తుతం దేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. తర్కించి, విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని, తనతో ఉంటే దేశభక్తుడిని.. లేకపోతే దేశద్రోహిని అనే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడింది. తెలంగాణలో మతభేదం లేకుండా జీవనం కొనసాగుతోంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

 

Leave a Reply