అర్ధరాత్రి హీరోయిన్‌కు వేధించిన ట్యాక్సీ డ్రైవర్..ఆ క్యారెక్టర్‌ను దూషిస్తూ

Share Icons:
బెంగాలీ హీరోయిన్, లోక్‌సభ ఎంపీ మిమి చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం రాత్రి కారుతో వెళ్తున్న ఆమెను ఓ ట్యాక్రీ డ్రైవర్ వెంటపడి వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన రాజధాని కోల్‌‌కతా నగరంలోని బలీగుంగే ఫారీ ప్రాంతంలో జరిగింది. అనేక బెంగాలీ సినిమాల్లో నటించిన గత లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున జాదవ్‌పూర్ నియోజవర్గం నుంచి గెలుపొందారు.

Also Read:

మిమి చక్రవర్తి ఇటీవల మహాలయ స్పెషల్‌‌లో భాగంగా మహిషాసుర మర్దిని అనే షోలో కనిపించారు. బెంగాళీ దర్శకుడు కమలేశ్వర్ రూపొందించిన ఈ షో త్వరలోనే ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే మిమిని ఉద్దేశించి టాక్సీ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెను ట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలోనే అతడికి చీవాట్లు పెట్టిన నటి ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై మిమి చక్రవర్తి స్పందిస్తూ.. 14వ తేదీ రాత్రి 1.30 గంటల సమయంలో గరియాహాట్ రోడ్ నుంచి బల్లీగుంజే ఫన్ని వైపు కారులో వెళ్తుండగా ఓ ట్యాక్సీ డ్రైవర్ నన్ను ఫాలో అయ్యాడు. గరియాహట్ క్రాసింగ్ వద్ద నన్ను వేధిస్తూ దుర్భాషలాడాడు. అతడి బారి నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని దేబా యాదవ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.