అనసూయ డేర్ స్టెప్.. రాజకీయాల్లోకి ఎంట్రీ! జబర్ధస్త్ స్కెచ్చేసిన క్రేజీ బ్యూటీ

Share Icons:
వెండితెర, బుల్లితెరలపై నటించిన ఎందరో నటీనటులు రాజకీయ బాట పట్టి ప్రజలతో మమేకం కావడం చూశాం. అలా వెళ్లిన కొందరు పొలిటికల్‌గా విఫలం కాగా, ఇంకొందరు సక్సెస్ అయ్యారు. అయినప్పటికీ కెమెరా ముందు నుంచి ప్రజల ముందుకు వెళ్లి మైకు పట్టుకునేందుకు ఆసకక్తి చూపే వారు ఎక్కువవుతేనే ఉన్నారు. తాజాగా ఇదే బాటలో జబర్దస్త్ బ్యూటీ వెళ్ళడానికి సన్నాహాలు చేస్తోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిన్నితెరపై, వెండితెరపై అలరిస్తూ హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ కూడగట్టుకున్న అనసూయ రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీతో పాటుగా పలు పార్టీల నుంచి ఆమెకు ఆహ్వానం అందినట్లుగా చెప్పుకుంటున్నారు. దీంతో ఆలోచనలో పడిన జబర్దస్త్ బ్యూటీ.. రాజకీయ ఆరంగేట్రంపై తన సన్నిహితులతో చర్చిస్తోందని సమాచారం. కెరీర్ పీక్‌లో ఉన్న ఈ సమయంలోనే ఎలాంటి అడుగైనా ధైర్యంగా వేయాలనే కోణంలో ఆమె ఉన్నట్లు టాక్.

Also Read:
సోషల్ మీడియాలో అనసూయ రాజకీయాలకు సంబంధించిన వార్తలు జబర్దస్తీ చేస్తుండటంతో జనాల్లో ఈ ఇష్యూపై చర్చలు మొదలయ్యాయి. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై హవా కొనసాగుతున్న ఈ సమయంలో రాజకీయాల జోలికి ఆమె వెళ్లడం సరికాదని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి.. తనకు సంబంధించి ఎలాంటి రూమర్స్ వచ్చినా వెంటనే స్పందించే జబర్డస్త్ బ్యూటీ ఈ వార్తలపై ఎలా రియాక్ట్ అవుతుందనేది.