అధికారి చెంప చెల్లుమనిపించిన బీజేపీ నాయకురాలు.. వీడియో వైరల్

Share Icons:
ర్యానా బీజేపీ మహిళా నేత, టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగ‌ట్ తన దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ధాన్యం మార్కెట్‌లో ఓ అధికారిని చెప్పు తీసుకొని కొట్టారు. చెంపల పైనుంచి చెడామడా వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారిపై ఆమె దాడి చేస్తుండగా అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోవడం గమనార్హం.

కరోనా మహమ్మారి ప‌రిస్థితుల నేప‌థ్యంలో హర్యానాలోని హిస్సార్‌లో ధాన్యం మార్కెట్‌ను తనికీ చేయడానికి సోనాలి వెళ్లారు. అక్కడ పలు అంశాలపై అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడున్న మార్కెట్ సెక్రటరీతో ఆమెకు గొడవ జ‌రిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి తన చెప్పు తీసుకొని అత‌డి చెంపల పైనుంచి పలుమార్లు కొట్టారు.

వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించారు. ఆ అధికారి తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. దుర్భాష‌లాడుతూ, త‌న‌ను అవ‌మానించ‌డం వ‌ల్లే కొట్టాల్సి వ‌చ్చింద‌ని వివరణ ఇచ్చింది. తానేమీ అన‌క‌ముందే ఆమె త‌న‌పై ఇష్టమొచ్చినట్లు దాడి చేశారని మార్కెట్ సెక్రటరీ ఆరోపిస్తున్నారు.

టిక్‌టాక్‌తో పాపులర్ అయిన సోనాలి ఫోగ‌ట్‌కు బీజేపీ గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు త‌థ్యమని అందరూ భావించారు. కానీ అందరి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ చేతిలో ఓట‌మిపాలైంది.

‘భార‌త్ మాతాకీ జై’ అని చెప్పని వాళ్లను పాకిస్థానీయులుగా పేర్కొంటూ సోనాలి ఫోగట్ గతంలో ఒకసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. తాజాగా ఆమె మరోసారి వివాదంలో నిలిచారు. సోనాలి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Must Read: