అదో వ్యసనం.. విరాట్ కోహ్లీ, తమన్నాలను వెంటనే అరెస్ట్ చేయాలి.. హైకోర్టులో పిటిషన్

Share Icons:
టీమ్ ఇండియా కెప్టెన్ , టాలీవుడ్ హీరోయిన్ తమన్నాలు వెంటనే అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనంగా మారింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ (జూదం)ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తున్నందుకు గాను వీరిపై పిటిషన్ వేశాడు చెన్నైకి చెందిన ఓ న్యాయవాది. మోసపూరితమైన ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేస్తూ యువతను వీరు పెడదోవ పట్టిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ గేమ్ అనేది యువతలో ఓ వ్యసనంగా మారుతోందని, ఆన్‌లైన్ గేముల నిర్వాహకులు భారీగా నగదు, బోనస్‌లు ప్రకటిస్తుండడంతో యువత దీనికి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే ఆ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ అన్నింటినీ నిషేధించాలని సదరు న్యాయవాది కోరారు. అంతేకాదు బాధ్యతారహితంగా వాటిని ప్రమోట్ చేస్తున్న కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:
ఇటీవల ఓ యువకుడు ఆన్‌లైన్ గేముల కోసం అప్పులు చేసి.. తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఈ తరహా ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోయాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు దీనిపై వచ్చే మంగళవారం విచారణ జరపనున్నట్లు తెలిసింది. కాగా తమపై దాఖలైన ఈ పిటిషన్‌పై కోహ్లి, తమన్నాలు ఇంకా స్పందించలేదు. సో.. చూడాలి మరి వీరిద్దరి విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది!.