అదిరింది రా.. నీ కొత్త అవతారం!! వెయిటింగ్ ఇక్కడ.. అల్లరోడి‌పై నాని కామెంట్స్

Share Icons:
హీరో పుట్టిన రోజు కానుకగా ఆయన లేటెస్ట్ మూవీ ‘నాంది’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే గాక, టీజర్‌లో అల్లరోడి అవతారం, డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ‘నాంది’ టీజర్ చూసిన .. తనదైన స్టైల్ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు.

`అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. `నాంది` సినిమా కోసం వెయిట్ చేస్తున్నా` అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ మేరకు తన బర్త్ డే సర్‌ప్రైజ్ అని పేర్కొంటూ అల్లరి నరేష్ చేసిన ట్వీట్ ట్యాగ్ చేశాడు. కేవలం హీరోలుగానే కాక
నిజ జీవితంలో కూడా అల్లరి నరేష్, నాని మంచి స్నేహితులు కావడంతో ఈ ట్వీట్ చూసి ఇరువురి అభిమానులు మురిసిపోతున్నారు.

Also Read:
విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న నాంది సినిమాకు స‌తీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. అల్లరి నరేష్ కెరీర్‌లో ఇది 57వ సినిమా. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు ‘నాంది’ నుంచి విడుదలైన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.