అందంగా ముస్తాబవుతున్న కాజల్ కొత్త ఇల్లు.. పెళ్లయ్యాక అన్నీ అక్కడే!

Share Icons:
టాలీవుడ్‌లో వరుసగా సినీతారల పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ లిస్టులో చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన ఆమె అందుకు ముహూర్తం కూడా పెట్టేసి సర్‌ప్రైజ్ చేసింది. ఈ నెల 30న కాజల్- గౌతమ్ కిచ్లు పెళ్లి బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తాము ఎక్కడ ఉండబోతున్నామనే దానిపై రియాక్ట్ అయింది కాజల్.

అక్టోబర్ 30వ తేదీన ముంబైలో అత్యంత స‌న్నిహితుల సమక్షంలో కాజల్ వివాహ వేడుక జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు స్వయంగా చూసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్ళైన వెంటనే భర్తతో ఉండబోయే ఇంటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందట. ఇప్ప‌టికే సొంత ఇంటిని కొనేసుకున్న కాజ‌ల్ అండ్ గౌత‌మ్ ఆ ఇంటిలోని ఇంటీరియ‌ర్ డిజైన్‌ని త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా మలచుకుంటున్నారట.

Also Read:
ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లతో పాటు ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జ‌రిగిపోతున్నాయని తెలుస్తోంది. కాజ‌ల్‌కి కాబోయే భర్త గౌత‌మ్ కిచ్లూ ఓ బిజినెస్‌మెన్‌ అనే విషయం తెలిసిందే. ఓ ఇంటీరియ‌ర్ బిజినెస్‌కు సంబంధించిన కంపనీని ర‌న్ చేస్తున్న ఆయన తన సొంత ఇంటిని మరింత ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారట. ఈ విష‌యాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా కాజల్ వెల్లడించింది.

మా కొత్త ఇంట్లో ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. ఏమైనా స‌ల‌హాలు,సూచ‌న‌లు ఇస్తారా? అంటూ పోస్ట్ పెట్టింది కాజల్. ఆమె చేసిన ఈ పోస్ట్ చూసి ”కాజ‌ల్ మరీ ఫాస్ట్‌గా ఉందే!, కొత్త ఇల్లు.. కొత్త జీవితం.. అదిరిందమ్మా ముద్దుగుమ్మా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ప్ర‌స్తుతం క‌మ‌ల్‌ హాసన్ సరసన ‘ఇండియ‌న్ 2’, చిరంజీవి సరసన ‘ఆచార్య‌’, మంచు విష్ణుతో ‘మోస‌గాళ్లు’ చిత్రాల్లో నటిస్తున్న కాజల్ ఈ మూవీస్ పూర్తయిన తర్వాతనే హనీమూన్ ట్రిప్ వేయనుందని టాక్.